CM Revanth Reddy | రెండేళ్లలో టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణలో ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలు కమిట్‌మెంట్‌తో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆర్థిక వెసులుబాటును బట్టి సమస్యలు పరిష్కరిస్తామని, టీచర్లు ధర్నాలు చేస్తే విద్యార్థుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపారు.

కొడంగల్‌ (Kodangal)లో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలను భవిష్యత్ కథనాయకులుగా తీర్చిదిద్దేది టీచర్లే అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ముఖ్యమంత్రి అయ్యానని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాలని సూచించారు. 2028 డిసెంబర్‌లో.. లేదంటే 2029 మార్చి, ఏప్రిల్‌లో ఎలక్షన్ ఉండొచ్చన్నారు. తాను టీచర్ల ముందుకు వస్తానని.. పాస్ చేస్తారా.. ఫెయిల్ చేస్తారా మీ ఇష్టం అన్నారు.

CM Revanth Reddy | నియామకాలు పూర్తి చేశాం

గతంలో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ఇస్తే, ఎప్పుడు పరీక్షలు జరిగేవో తెలిసేదికాదని సీఎం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు పూర్తిచేశామని తెలిపారు. 55 రోజుల్లోనే పరీక్షలు, నియామకాలు జరిగిపోయాయన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా 25,950 టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని వెల్లడించారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.

CM Revanth Reddy | అవాస్తవాలు ప్రచారం

పాలిటెక్నిక్ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని సీఎం కోరారు. విద్యార్థులను అడ్డుపెట్టుకుని తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి అలాంటివారి ట్రాప్​లో పడొద్దన్నారు. తమ పాలనలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. 2024 నుంచి 2026 వరకు 37 వేల మంది, 2026–2027 విద్యా సంవత్సరంలో మరో 51 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ఉపాధ్యాయుల పై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Phone Addiction | ఫోన్​ వ్యసనంపై ప్రధాని మోదీ ఆందోళన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *