అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BRS Bike Rally | కాంగ్రెస్ వైఫల్యాలను నిరసిస్తూ నగరంలో(Nizamabad) బీఆర్ఎస్(BRS Nizamabad) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించారు.
BRS Bike Rally | పోరాటం ఉధృతం చేస్తాం
పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్టాండ్ మీదుగా సాగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది. బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
BRS Bike Rally | ఆరు గ్యారంటీల పేరుతో మోసం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని బిగాల మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, గాండ్ల లింగం, చింతకాయల రాజు, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దుర్గం చెరుపై KTR ట్వీట్