Fake Certificates | నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్​..

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Fake Certificates | నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) నగరంలోని సీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

Fake Certificates | బోధన్​ పట్టణంలోని రాకాసీపేట్​లో..

పట్టణం(Bodhan) రాకాసిపేట్​లో ‘సహారా మీ సేవ కేంద్రం’లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. సీసీఎస్​ ఏసీపీ శ్రీశైలం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. తనిఖీలో మీసేవ ఆపరేటర్ షేక్ వసీమ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గత రెండేళ్ల నుంచి మీసేవ యజమాని మహమ్మద్ ముక్రం, ఇతరులతో కలిసి మీసేవ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. సర్టిఫికెట్లు తయారు చేసి వాటిపై స్టాంపులు వేసి.. అసలు సర్టిఫికెట్లుగా తయారు చేసి ఒక్కో సర్టిఫికెట్​కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసి పంచుకునేవారు.

ఈ బాగోతాన్ని పసిగట్టిన పోలీసులు ప్రధాన సూత్రధారులైన షేక్​ వసీం, మహహ్మద్​ ముక్రంలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు నకిలీ సర్టిఫికెట్లు, జిరాక్స్​​ పత్రాలు, రబ్బర్​ స్టాంప్​, నకిలీ టీసీ, బోనాఫైడ్లు, షాదీ ముబారక్​ సర్టిఫికెట్, కలర్​ప్రింటర్​ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న సీసీఎస్​ సీఐ అజయ్​, ఎస్సై శ్రీనివాస్​, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ అనిల్, గంగప్రసాద్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ, ఎస్సై రాం, కానిస్టేబుల్ గంగారం, శివ కృష్ణను సీపీ అభినందించారు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్.. బిగ్ సర్ప్రైజ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *