RTC Metro Joint Pass | నగరవాసులకు గుడ్​న్యూస్​.. త్వరలో ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్​

ఆర్టీసీ-మెట్రో రైలు ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు అధికారులను ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Metro Joint Pass | హైదరాబాద్ (Hyderabad)​ నగరవాసులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలో RTC-మెట్రో రైల్ ఉమ్మడి పాస్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ RTC బస్సు ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను (joint pass) వెంటనే ప్రవేశపెట్టాలని సీఎస్​ ఆదేశించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నెలవారీ, రోజువారీ పాస్‌లను అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో HMRL, TGSRTC, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ శాఖ ప్రతినిధులతో ఆదివారం ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

RTC Metro Joint Pass | పనులు త్వరగా ప్రారంభించాలి

హైదరాబాద్ మెట్రో మొదటి, రెండవ దశల పనులలో ఇప్పటివరకు చేపట్టిన వివిధ చర్యల గురించి మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ సీఎస్​కు వివరించారు. పాతబస్తీ మెట్రో కారిడార్ కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల ప్రస్తుత స్థితిని ఆయన తెలుసుకున్నారు. 7.5 కిలోమీటర్ల పాతబస్తీ కారిడార్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, మెట్రో ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. మెట్రో, ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఉమ్మడి పాస్‌ను జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

RTC Metro Joint Pass | మెట్రో రైలులో ప్రయాణించిన సీఎస్​

ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju), మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్​, ఇతర అధికారులతో కలిసి ఆదివారం మెట్రో రైలులో ప్రయాణించారు. బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో వెళ్లారు. స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, వాటిని మరింత అభివృద్ధి చేయడానికి తగిన సూచనలు చేశారు. NH-44పై HMDA నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను పరిశీలించారు.

దీనిని కూడా చదవండి : KCR Padayatra | లక్ష మందితో కేసీఆర్ పాదయాత్ర: హరీష్ రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.