Nizamabad Kidnapping Case | 24 గంటల్లోనే బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించాం.. సీపీ సాయిచైతన్య

జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్​ కేసును 24 గంటల్లోనే ఛేదించామని సీపీ సాయిచైతన్య తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Kidnapping Case | జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్​ కేసును 24 గంటల్లోనే ఛేదించామని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో (Nizamabad) కిడ్నాప్​ వివరాలను విలేకరులకు వివరించారు.

Nizamabad Kidnapping Case | చాక్లెట్​ ఆశ చూపి..

సీపీ మాట్లాడుతూ.. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన బాధిత కుటుంబం వద్ద నుంచి బాలుడు వేదాన్ష్​ను చాక్లెట్​ ఆశ చూపి అపహరించారని పేర్కొన్నారు. కిడ్నాపర్లను నిజాంపేట్​ గ్రామస్తులు సుజాత, ఎల్లమ్మగా గుర్తించామన్నారు. ఆస్పత్రి నుంచి బాలుడిని కేవలం మూడు నిమిషాల్లోనే ఎత్తుకెళ్లారని సీపీ తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా బాలుడిని సంగారెడ్డి జిల్లాలోని దౌలతాబాద్​ ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా గుర్తించి వారిని అరెస్ట్​ చేశామన్నారు. అనంతరం బాలుడిని రక్షించి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఏ వస్తువులు ఇచ్చినా తీసుకోవద్దని పిల్లలకు అవగాహన కల్పించాలని సీపీ పేర్కొన్నారు. పిల్లలను బయటకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

govt 1 temtyuh

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఈసారి ఆటే సవాల్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *