Mahesh Goud Comments | సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు: మహేష్ గౌడ్

పీసీసీ అధ్యక్షుడు ఎవరికీ రాజకీయ రక్షణగా ఉండరని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahesh Goud Comments | సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ అప్పుడే ఖండించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు.

క్రమశిక్షణ విషయంలో కులం, మతం, చిన్నాపెద్దా అనే తేడాలు ఉండవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Mahesh Goud Comments | క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం

క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైకమాండ్ నిర్ణయం తీసుకుందని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పలు అంశాలను ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: EHS Scheme | ఈహెచ్​ఎస్​పై భట్టి విక్రమార్క సమీక్ష

కొండా సురేఖను రాజీనామా చేయాలని తాను చెప్పలేదని మహేష్ గౌడ్ వెల్లడించారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు ఎవరికీ రాజకీయ రక్షణగా ఉండరని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పార్టీ నేతలు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన మహేష్ గౌడ్.. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *