అక్షరటుడే, వెబ్‌డెస్క్: RJ Charan Bigg Boss | నిజామాబాద్ Nizamabad జిల్లాకు చెందిన ఆర్జే చరణ్ మహదేవ్ బుల్లితెరపై తన సత్తా చాటుకునే అవకాశం దక్కించుకున్నాడు. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, తాజాగా 10వ సీజన్‌లో కామనర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
RJ Charan Bigg Boss | అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ వరకు
బిగ్ బాస్ నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2’లో తన ప్రతిభను ప్రదర్శించిన చరణ్.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన కామనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచే తన మాటతీరు, చురుకుదనం, గేమ్‌పై ఆసక్తితో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.
RJ Charan Bigg Boss | రేడియో జాకీగా కెరీర్ ప్రారంభం
నిజామాబాద్ జిల్లాకు చెందిన చరణ్ మహదేవ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ కుర్రాడు.. ఆ తర్వాత డిజిటల్ వేదికలపైన యాంకర్‌గా తన పరిచయాన్ని పెంచుకున్నాడు. వివిధ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు.
చరణ్‌కు డ్యాన్స్‌పై కూడా ఆసక్తి ఉంది. పిల్లలకు డ్యాన్స్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు వీడియో ఎడిటింగ్‌లోనూ తన నైపుణ్యాన్ని ఇతరులకు అందిస్తున్నాడు. ఇలా రేడియో, యాంకరింగ్, డ్యాన్స్, డిజిటల్ కంటెంట్ వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు.
RJ Charan Bigg Boss | హౌస్‌లో చరణ్ ఆట ఎలా ఉందంటే..
రేడియో రంగంలో పనిచేసిన అనుభవం బిగ్ బాస్ హౌస్‌లో చరణ్‌కు కలిసొస్తున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తూ.. చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. శారీరక సామర్థ్యంతో పాటు మైండ్ గేమ్స్‌లోనూ వెనుకడుగు వేయకుండా టాస్కుల్లో పాల్గొంటున్నాడు.
తోటి కంటెస్టెంట్లతో పోటీపడుతూ తనదైన శైలిలో గేమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా ఆమన్ మసూద్, రోహిత్ నాయుడు వంటి కంటెస్టెంట్లతో పోటీలో చరణ్ ప్రదర్శనపై ప్రేక్షకుల దృష్టి నెలకొంది.
ప్రేక్షకుల తీర్పే కీలకం
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే చరణ్ మహదేవ్‌కు బిగ్ బాస్ హౌస్ మరో పెద్ద వేదికగా మారింది. కామనర్‌గా అడుగుపెట్టిన ఆయన.. ఈ సీజన్‌లో ఎంత దూరం ప్రయాణిస్తాడు? తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడు? అనేది ఆసక్తికరంగా మారింది.