Thatha Madhu | తాతా మధుపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thatha Madhu | కాంగ్రెస్​ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. స్పీకర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాలకు బీఆర్​ఎస్​ నాయకులు నల్ల టీ షర్టులు ధరించి రాగా.. పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు పోలీసులతో వాగ్వాదం చేశారు. వారు తన ప్యాంట్​ లాగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్​ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాతా మధును తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు దళితులంటే చిన్న చూపు అన్నారు.

Thatha Madhu | స్పీకర్​ను అవమానపర్చలేదు

ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. తమ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారన్నారు. తాను దురుసుగా మాట్లాడటం నిజమేనని అంగీకరించారు. అయితే స్పీకర్‌ను, ఛైర్‌ను అవమానపర్చలేదన్నారు.

ఇది కూడా చదవండి..: Uttam Kumar Reddy Comments | కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్ కుమార్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *