బిజినెస్​Stock Market Losses | మళ్లీ నష్టాల బాట..

Stock Market Losses | మళ్లీ నష్టాల బాట..

దేశీయ స్టాక్ మార్కెట్ తిరిగి నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 416 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి భారీ నష్టాలతో ముగిసింది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు 111 డాలర్లు దాటడంతో ఆసియా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం, రూపాయి విలువ జీవనకాల కనిష్టాలకు పడిపోవడంతో మన మార్కెట్ సైతం నష్టాల బాటలో పయనించింది.

Stock Market Losses | రోజంతా ఊగిసలాట..

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగింది. ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 121 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 520 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 752 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 50 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 182 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 224 పాయింట్లు క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 416 పాయింట్ల నష్టంతో 76,886 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 23,995 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,998 కంపెనీలు లాభపడగా 2,257 స్టాక్స్ నష్టపోయాయి. 172 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 152 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 30 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market Losses | మిశ్రమంగా సూచీలు..

నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ 1.75 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.55 శాతం, టెలికాం ఇండెక్స్ 1.52 శాతం, మెటల్ 0.51 శాతం పెరగ్గా.. బ్యాంక్ నిఫ్టీ 1.54 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.98 శాతం, ఆటో 1.01 శాతం, ఐటీ 0.68 శాతం నష్టపోయాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ లాభపడగా.. 19 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ 1.68 శాతం, ఎయిర్ టెల్ 1.43 శాతం, టెక్ మహీంద్రా 0.95 శాతం, సన్‌ఫార్మా 0.80 శాతం, టాటా స్టీల్ 0.73 శాతం లాభపడ్డాయి.

Top Losers : యాక్సిస్ బ్యాంక్ 2.65 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.64 శాతం, ఇండిగో 2.59 శాతం, మారుతి 2.53 శాతం, ఎస్ బీఐ 1.88 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Volatility | ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....