నిజామాబాద్Sarpanch Role Development | గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

Sarpanch Role Development | గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు.

అక్షరటుడే, భిక్కనూరు: Sarpanch Role Development | గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) ఉపకులపతి ప్రొఫెసర్ టీ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం (South Campus), దోమకొండ ఫోర్ట్ విలేజ్ డెవలప్​మెంట్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం దోమకొండలో ‘గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ పంచాయతీరాజ్(panchayati raj) దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Sarpanch Role Development | గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

తెయూ ఉపకులపతి యాదగిరిరావు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. గ్రామాల్లో వసతుల (local governance) కొరతతో జరుగుతున్న వలసలను నివారించేందుకు సర్పంచులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు. పుస్తకజ్ఞానం కంటే అనుభవ జ్ఞానం గొప్పదన్నారు. రాజకీయాలలో గెలిచిన వ్యక్తులు ఓడిపోయిన వ్యక్తులను ప్రత్యర్థులుగా భావించకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని.. అప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

Sarpanch Role Development | సర్పంచ్​లకు డిజిటల్​ టెక్నాలజీపై అవగాహన

ఎన్‌ఐఆర్‌డీపీర్(NIRDPR) శాస్త్రవేత్త రవిబాబు మాట్లాడుతూ సర్పంచులకు(Sarpanch) డిజిటల్ టెక్నాలజీపై అవగాహన అవసరమని తెలిపారు. రైతుల అభివృద్ధికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence), జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ(District Library Association) ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. లైవ్ ఎన్‌జీవో వ్యవస్థాపకులు బాలప్రసాద్ గ్రామాభివృద్ధిని యువత, విద్య, రైతులు, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై కేంద్రీకరించాలని సూచించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుని నిష్పక్షపాతంగా అమలు చేయడం సర్పంచుల బాధ్యత అని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

దోమకొండ(Domakonda) సర్పంచ్ ఐరేని నర్సయ్య మాట్లాడుతూ.. ఈ తరహా అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరమన్నారు. మహిళా సర్పంచులు మాట్లాడుతూ మహిళా సాధికరత, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమం అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్​లకు సన్మానం చేసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్, ఎస్. నారాయణ గుప్తా, ఇంద్రకరణ్ రెడ్డి, దోమకొండ ట్రస్ట్ ఛైర్మన్ బాబ్జీ, శ్రీకాంత్ గౌడ్, కిషన్, కిరణ్ రాథోడ్, గంగా కిషన్, రాజేష్, రామలింగం, ప్రవీణ్ పాల్గొన్నారు.

tu1

ప్రసంగిస్తున్న ఎన్ఐఆర్డీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ రవిబాబు

ఇది కూడా చదవండి : CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌.. మే 1న బాధ్యతల స్వీకరణ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...