అక్షరటుడే, వెబ్డెస్క్: Glass Wall Systems IPO | గ్లాస్ వాల్ సిస్టమ్స్ కంపెనీని 2010లో స్థాపించారు. ఇది భారతదేశం అంతటా మరియు యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఫసాడ్ సొల్యూషన్స్ (బాహ్య గాజు/గోడ వ్యవస్థలు) మరియు ఫెనెస్ట్రేషన్ (కిటికీలు/తలుపులు) అందించే ప్రముఖ సంస్థలలో ఒకటి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కాంట్రాక్టర్లు, ఆస్పత్రులు, విమానాశ్రయ అధికారులు, కార్పొరేషన్లతో సహా వివిధ క్లయింట్లకు వాణిజ్య, నివాస మరియు సంస్థాగత ప్రాజెక్టులకు ఉత్పత్తులను అందిస్తుంది.
Glass Wall Systems IPO | ప్రధానంగా 3 రకాల వ్యాపారాలు..
డొమెస్టిక్ ఫసాడ్ సొల్యూషన్స్: భారతీయ క్లయింట్ల కోసం భవనాల బాహ్య భాగాలను డిజైన్, తయారు, సరఫరా మరియు ఇన్స్టాల్ చేయడం చేస్తుంది.
ఇంటర్నేషనల్ ఫసాడ్ ప్రొడక్ట్స్: విదేశాలకు పర్యావరణ అనుకూల ఫసాడ్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది.
ఫెనెస్ట్రేషన్ సొల్యూషన్స్: భారతదేశంలోని ఉన్నత శ్రేణి వినియోగదారుల కోసం ప్రీమియం కిటికీలు, తలుపులు, స్కైలైట్లు, పార్టిషన్లను తయారు చేస్తుంది.
Glass Wall Systems IPO | రూ. 427.89 కోట్ల సమీకరణ లక్ష్యం..
ఐపీఓ (IPO) ద్వారా కంపెనీ మొత్తం రూ. 427.89 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 32,96,703 షేర్లను విక్రయించి రూ. 60 కోట్లు, అలాగే ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,02,13,722 షేర్లను విక్రయించి రూ. 368 కోట్లు పొందనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Glass Wall Systems IPO | ప్రైస్ బ్యాండ్
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 172 నుంచి రూ. 182 లుగా నిర్ణయించింది. ఒక లాట్లో 82 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,924 తో బిడ్లు వేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లకు బిడ్లు వేయవచ్చు.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటా కేటాయిం.
జీఎంపీ : గ్లాస్ వాల్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు గ్రే మార్కెట్లో డిమాండ్ కనిపిస్తోంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 50 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 27 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ముఖ్యమైన తేదీలు : ఐపీవో సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 8న (మంగళవారం) ప్రారంభమైంది. బిడ్డింగ్నకు 10 వ తేదీ వరకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 11న షేర్స్ అలాట్మెంట్ స్టేటస్ వెల్లడికానుంది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 16న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Poco X8 Power 5G | పోకో నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. 11 న సేల్ ప్రారంభం