Khade Hanuman Temple | కదలని హనుమంతుడు.. 11 రోజులుగా భారీ యంత్రాలతో పెకిలించే ప్రయత్నం.. ఉజ్జయినిలో అద్భుత ఘటన

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Khade Hanuman Temple | ఆధ్యాత్మిక నగరి ఉజ్జయినిలో సింహస్థ్ 2028 ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

సుమారు 160–170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడే హనుమాన్ ఆలయం’లోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఆ విగ్రహం తన స్థానాన్ని వీడకపోవడం ఇప్పుడు భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది.

రహదారి విస్తరణ కోసం పురాతన ఆలయ విగ్రహాన్ని తొలగించేందుకు పరిపాలనా యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. గత 11 రోజులుగా భారీ యంత్రాలతోనూ ప్రయత్నాలు చేసినప్పటికీ విగ్రహం కదలకపోవడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు.

Khade Hanuman Temple | శతాబ్దాల చరిత్రకు సాక్షిగా..

విగ్రహం ఎంతో పురాతనమైనదని, సుమారు శతాబ్దన్నర కాలంగా భక్తుల పూజలు అందుకుంటోందని స్థానికంగా చెబుతున్నారు. ఇలాంటి ప్రాచీన విగ్రహాన్ని బలవంతంగా తరలిస్తే అది ఖండితమయ్యే ప్రమాదం ఉందని పురావస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CPS Pension Issues | రిటైర్డ్​ ఉపాధ్యాయుడి చేతికి పల్లీల బుట్ట.. సీపీఎస్ ఇచ్చిన ఘన మైన కానుక.. నేతలకేమో మల్టీపుల్ పెన్షన్లు!

దీంతో అధికారులు వెనక్కి తగ్గి.. ఇక సాధారణ పద్ధతుల్లో కాకుండా శాస్త్రీయ విధానంలోనే పరిశీలించాలని నిర్ణయించారు. ఆర్కియాలజిస్టులు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో విగ్రహానికి ప్రత్యేక స్కానింగ్, శాస్త్రీయ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Khade Hanuman Temple | భక్తుల్లో భక్తి భావం

విగ్రహాన్ని తరలించే ప్రయత్నాలు విఫలమైన విషయం తెలియడంతో స్థానిక భక్తుల్లో ఆధ్యాత్మిక చర్చ మొదలైంది. “శతాబ్దాలుగా కొలువైన ఆంజనేయ స్వామి తన స్థానాన్ని వీడటం లేదు” అంటూ పలువురు భక్తులు భావోద్వేగానికి గురవుతున్నారు.

హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పురాతన ఆలయం, విగ్రహం పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Khade Hanuman Temple | చారిత్రక రహస్యం ఏమిటో..

సింహస్థ్ మహాకుంభానికి సన్నాహాలు జరుగుతున్న ఉజ్జయినిలో.. అభివృద్ధి పనుల మధ్య వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు భక్తి, చరిత్ర, పురావస్తు పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక అంశంగా మారింది.

తరలించాలనుకున్న విగ్రహం కదలలేదు.. దీంతో అధికారులే ఆలోచనలో పడ్డారు. శాస్త్రీయ పరీక్షల తర్వాత ఈ పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక ఉన్న చారిత్రక రహస్యం ఏంటో తేలనుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *