Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Prices | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో చమురు మంటలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణ భయాలు, పెరుగుతున్న గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ దేశీయ మార్కెట్లూ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Crude Oil Prices | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic Markets) శుక్రవారం భారీ నష్టాýతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 593 పాయింట్ల గ్యాప్ డౌన్ లో ప్రారంభమై మరో 149 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 424 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 39 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 129 పాయిట్లు పైకి ఎగబాకింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 370 పాయింట్ల నష్టంతో 74,532 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో 23,350 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 11 స్టాక్స్ లాభాలతో, 19 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. హెచ్సీఎల్ టెక్ 2.11 శాతం, టెక్ మహీంద్రా 1.80 శాతం, ఇన్ఫోసిస్ 0.97 శాతం, ఎటర్నల్ 0.89 శాతం, ఎయిర్‌టెల్ 0.58 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇండిగో 2 శాతం, టాటా స్టీల్ 1.88 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.78 శాతం, రిలయన్స్ 1.31 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.21 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర ఎంతంటే?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *