Harish Rao Salary Cuts | ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా ప్రజా పాలన : హరీశ్​రావు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Salary Cuts | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో మున్సిపల్​ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు.

ఇన్నేళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి.. కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం 31 వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ (BRS) హయాంలో వేతనాల పెంపు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేతనాల్లో కోతలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సీఎంను ఆయన ప్రశ్నించారు.

Harish Rao Salary Cuts | ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన అవుతుంది.

ప్రభుత్వం వెంటనే జీవో 1181ను రద్దు చేయాలని, ఉద్యోగుల పూర్వపు హోదాను యథావిధిగా కొనసాగించాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. వేతన రక్షణ కల్పించడంతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం ప్రజా పాలన కాదని, ప్రజా పీడన అన్నారు.

ఇది కూడా చదవండి..: Mock Assembly | తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *