KTR Allegations | కాంగ్రెస్​ కార్యకర్తల్లా పోలీసుల తీరు : కేటీఆర్​

రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్​ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Allegations | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్​ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపల 15 మంది తన పీఏ, పీఆర్వోలపై దాడి చేయడానికి యత్నించారన్నారు.

కేటీఆర్​ (KTR) పీఏ మహేందర్​ రెడ్డి, పీఆర్వో మహేశ్​ను పోలీసులు సోమవారం విచారణకు పిలిచారు. ఈ క్రమంలో వారిపై 15 దాడి చేశారని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపించారు. దీనిపై మంగళవారం ఉదయం కేటీఆర్​ స్పందించారు. దాడి చేసిన వారు గుండాలా లేదా మఫ్టీలో వచ్చిన పోలీసులా తెలియాల్సి ఉందన్నారు. ఆ దుండగుల మీద ఎఫ్ఐఆర్ చేయమంటే కూడా చేయడం లేదని మండిపడ్డారు.

KTR Allegations | కేసీఆర్​ ఇంటిపై సైతం..

రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేటీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు సార్లు సీఎంగా చేసిన కేసీఆర్​ ఇంటిపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల తమను అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినప్పుడు అక్కడ కూడా దాడులు చేశారన్నారు. సోమవారం విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు అడ్డుపడ్డారనే నెపంతో పిలిపించిన మా సిబ్బందిపై పోలీస్ స్టేషన్ లోపలే దాడి జరిగిందన్నారు. పోలీసులు గూండాలకు మద్దతు ఇవ్వడంతో స్టేషన్ ఆవరణలో కూడా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

KTR Allegations | కోర్టును ఆశ్రయిస్తాం

తన పీఏ, పీఆర్​వోలపై దాడి చేసిన వారిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం లేదని కేటీఆర్​ అన్నారు. దీంతో తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసహనంతో ఉందన్నారు. వెయ్యి రోజుల వైఫల్యాలపై తాము ప్రశ్నిస్తుండటంతో దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Bandlaguda Murder | కొడవళ్లు, కత్తులతో వెంటబడి.. బండ్లగూడలో ఒకరి దారుణ హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *