Engineers Day Nizamabad | మోక్షగుండం విశ్వేశ్వరయ్యను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

దేశం గర్వించదగ్గ ఇంజినీర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ట్రాన్స్​కో ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​రావు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Engineers Day Nizamabad | దేశం గర్వించదగ్గ ఇంజినీర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ట్రాన్స్​కో ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​రావు సూచించారు. ఇంజినీర్స్​డేను నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల (Polytechnic College)లో ఘనంగా నిర్వహించారు.

Engineers Day Nizamabad | మంచిపేరు తేవాలి

పీవీ రాజేశ్వర్​రావు కళాశాలలోని నార్త్ బ్లాక్ సమావేశ మందిరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక డిప్లొమా ఇంజినీర్​గా నిబద్ధతతో పనిచేసి భారతరత్న అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి బాగా చదివి కళాశాలకు మంచిపేరు తేవాలని సూచించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ రాష్ట్రంలోనే ఉన్నతస్థానంలో ఉందన్నారు. కార్యక్రమం గౌరవ అతిథి పంచాయతీరాజ్ ఎస్ఈ రాథోడ్ శంకర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థానాల్లో ఉన్నారు. తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది విశ్రాంత ఇంజినీర్లకు ఘనంగా సన్మానించారు.

Engineers Day Nizamabad | ఉత్తమ విద్యార్థులకు సన్మానం

పాలిటెక్నిక్ బ్రాంచ్ టాపర్లు అయినా ఆరుగురు విద్యార్థులకు మెడళ్లు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు, బిగాల కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10వేల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్​ఛార్జి ప్రిన్సిపల్ రాజన్న, పూర్వ విద్యార్థుల సంఘం సహా అధ్యక్షుడు కేఎల్వీ రమణ, ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మోహన్ కుమార్, సంయుక్త కార్యదర్శి పొలాస సత్యనారాయణ, వినోద్ కుమార్, బాబా శ్రీనివాస్, కృష్ణమూర్తి, నరేష్ కుమార్, హరికృష్ణ, వీరేశం, గంగాధర్, రషీద్ భాయ్, సయ్యద్, రచ్చ నర్సయ్య, భూమయ్య, విశ్రాంత ప్రిన్సిపల్ నాగయ్య, ప్రకాష్ రావు, నాయుడు సుబ్బారావు పాల్గొన్నారు.

Engineers Day Nizamabad | సన్మాన గ్రహీతలు వీరే..

ఈ సందర్భంగా విద్యార్థులు వర్మ (సివిల్), రమణి (మెకానికల్), పాటిల్ అమృత (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్), కే సాత్విక (ఎలక్ట్రానిక్స్), అనుములవార్ లాస్య ప్రియ (కంప్యూటర్ సైన్స్), సాలూరి సోని( ఎమెడం సిస్టం)లను సన్మానించారు. అలాగే రిటైర్డ్​ అయిన ఇంజినీర్లు ఏడీఈలు రవి, లక్ష్మణ్​ నాయక్​, వరప్రసాద్​, అమరేందర్​, సుదర్శన్​ రెడ్డి, పీఆర్​ శాఖ గిరిధర్, ఇలియాజ్​ మిర్జా​లను సన్మానించారు.

tuiu

ఇది కూడా చదవండి..: Nizamabad Collectorate | కలెక్టరేట్​లో మట్టిగణనాథుడికి భక్తితో పూజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *