అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీపీఐ మావోయిస్టు సీనియర్ అండర్ గ్రౌండ్ క్యాడర్ డివిజన్ కమిటీ సభ్యురాలు పోలీసుల (Nizamabad Police) ఎదుట లొంగిపోయింది.
Maoist Lalitha Surrender | జనజీవన స్రవంతిలో..
మావోయిస్టు కమిటీ సభ్యురాలు నక్క సుశీల అలియాస్ రాణి అలియాస్ లత లలిత రేలా జ్యోతి అలియాస్ మాధవి అలియాస్ శ్వేత నిజామాబాద్ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) మంగళవారం మీడియా సమక్షంలో వివరాలు వెల్లడించారు. మావోయిస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యురాలు, డీవీసీ ఛత్తీస్‌ఘడ్ ఏరియా సభ్యురాలైన నక్క సుశీల బోధన్‌లోని శంకర్ నగర్ కాగా.. ఆమె తండ్రి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. అక్టోబర్ 2005లో ఆయన గుండెపోటుతో మరణించారు. సుశీల చిన్నప్పుడే తల్లి కమల అనారోగ్యంతో మృతి చెందింది. సుశీల 1985లో హైదరాబాద్‌లోని నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. 1985 నుంచి 1987 వరకు, ఇంటర్మీడియట్ అలాగే 1987 నుంచి 1990 వరకు డిగ్రీ విద్యను హైదరాబాద్‌లోని నాంపల్లి ఉన్నత విద్య వనిత జూనియర్ కాలేజీలో డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం బీఈడీ కూడా చేశారు.
Maoist Lalitha Surrender | అనంతరం మావోయిస్టుగా..
హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెకు బంధువైన సురేంద్ర ద్వారా దివంగత రామ్మోహన్రావు పరిచయమయ్యారు. ఆయన సీపీఐ ఎంఎల్ పీడబ్ల్యూ సిద్ధాంతాలు కలిగి ఉండడంతో సుశీల ఆకర్షితురాలైంది. ఆమె 1990లో నల్గొండ జిల్లా కమిటీ ఏసీఎం అయిన సుంకర రామ్మోహన్‌రావును వివాహం చేసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 1992లో సీపీఐఎంఎల్ పీడబ్ల్యులో చేరారు. 2001లో నల్లమల అడవిలో జరిగిన ఎదురు కాల్పుల్లో రామ్మోహన్ రావు మరణించారు. ఆ తర్వాత 2004లో ఆమె ఎస్సీఎం సామలును వివాహం చేసుకున్నారు. ఛత్తీస్ గడ్ అటవీప్రాంతంలో 2006లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారు. అయితే తెలంగాణకు చెందిన అజ్ఞాత మావోయిస్టు కార్యకర్తలు అందరూ జనజీవన స్రవంతిలో చేరాలని ప్రభుత్వం చేసిన సూచన మేరకు నక్క సుశీల సైతం జనజీవన స్రవంతిలో కలిసినట్లు సీపీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: చీమ లాంటి వినాయకుడి రథం.. మైక్రో ఆర్టిస్ట్ నైపుణ్యం