Telangana High Court | ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదం.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో జరిగిన 'పసుపు నీళ్ల' వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana High Court | సిద్దిపేట జిల్లా  ( Siddipet ) ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో జరిగిన ‘పసుపు నీళ్ల’ వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయవద్దని పోలీసులను స్పష్టంగా ఆదేశించింది. ఎలాంటి ముందస్తు అరెస్టులకు పాల్పడకుండా, కేవలం చట్టపరమైన నోటీసులు జారీ చేసి మాత్రమే దర్యాప్తు ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.

Telangana High Court | దుమారం రేపిన ఘటన..

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పసుపు నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ నేతలు, స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Telangana High Court | పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం..

కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో.. వారు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పుడు నిందితులను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది.

ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా తొందరపడి అరెస్టులు చేయడం సరికాదని మందలించింది. నిందితులకు కేవలం సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి, చట్టప్రకారమే విచారణ జరపాలని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:  Nirmala Sitharaman | దేశ ప్రయోజనాలే ప్రథమం.. జెన్-జెడ్, జెన్ ఆల్ఫా యువతకు నిర్మలా సీతారామన్ పిలుపు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *