అక్షరటుడే, వెబ్డెస్క్: Gandhari AO Rajalingam FIR | గాంధారి మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) రాజలింగం అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ (BKS) నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పిటిషన్ అందజేయడంతో పాటు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
Gandhari AO Rajalingam FIR | బాధితుడికి మద్దతుగా పోరాటం
గాంధారి మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమరిపేట రవి అనే రైతు పట్ల ఏవో రాజలింగం అత్యంత దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తించడాన్ని కిసాన్ సంఘ్ ఆరోపించింది. బాధ్యతాయుతమైన మండల స్థాయి ప్రభుత్వ అధికారిగా ఉండి రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారిని బూతులు తిట్టడం విచారకరమని నాయకులు మండిపడ్డారు.
Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!
ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు శంకరరావు మాట్లాడుతూ.. అన్నదాతలకు సేవ చేయాల్సిన వ్యవసాయ అధికారి రైతులపై ఇష్టానుసారంగా విరుచుకుపడటం సిగ్గుచేటని విమర్శించారు.
Gandhari AO Rajalingam FIR | ఎఫ్‌ఐఆర్ నమోదుకు డిమాండ్
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఏవో రాజలింగంపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు వెంటనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఏవో రాజలింగంపై సస్పెన్షన్ వేటు వేయకపోతే, భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ బాధ్యులు, నర్సాపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.