అక్షరటుడే, వెబ్‌డెస్క్: OYO Rooms Ganja | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కొండాపూర్‌లో ఓయో రూముల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
అస్సాంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ (25) గతంలో నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పని చేశారు. అనంతరం గంజాయి దందాలోకి దిగారు. తమ రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయాలు చేపడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కొండాపూర్‌లోని ఓ హోటల్లో ఓయో రూముల కేంద్రంగా దందా చేస్తున్నారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని సదరు హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. రూ.9 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
OYO Rooms Ganja | జీతాలు సరికపోకవడంతో..
నిందితులు గతంలో సెక్యూరిటీ గార్డులుగా పని చేశారు. అయితే జీతాలు సరిపోకపోవడంతో.. గంజాయి దందా చేయాలని నిర్ణయించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలని ఈ దందాలోకి దిగారు. గంజాయిని నగరానికి తీసుకువచ్చిన తర్వాత, చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి హోటల్ గదుల నుంచి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
ఇది కూడా చదవండి..: Breakfast Scheme | సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన మంత్రి పొన్నం