అక్షరటుడే, వెబ్డెస్క్: Bigala Ganesh Gupta 22A | ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై, రాజకీయ పరిణామాలపై నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘అక్షర టుడే’ డిజిటల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Bigala Ganesh Gupta 22A | ప్రభుత్వ పాలనపై విమర్శలు
భూములు, ఆస్తులను 22A జాబితాలో చేర్చడంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, తాను కూడా 22A బాధితుడినేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ పాలనా తీరు ఏమాత్రం బాగోలేదని, సమాజంలోని ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని గణేష్ గుప్తా మండిపడ్డారు. రైతులు, సామాన్య ప్రజలు, కూలీలు, ఐటీ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Bigala Ganesh Gupta 22A | హైడ్రా కూల్చివేతల తీరు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ప్రభుత్వం ప్రారంభించిందని బిగాల ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో.. పేద, మధ్యతరగతి ప్రజల భవనాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు.
Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!
తన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందని, తాను చేసిన అభివృద్ధిని ఎప్పుడూ పెద్దగా డబ్బా కొట్టుకోలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మంత్రి కావాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉన్నట్లే తనకు కూడా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు.