Treasury Officers Bribe | రూ.2.50 లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు

రంగారెడ్డి జిల్లా చేవెల్ల సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ లంచం తీసుకుంటూ దొరికారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Treasury Officers Bribe | రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారిని లంచాల కోసం వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా ఇద్దరు ట్రెజరీ అధికారులు లంచం తీసుకుంటూ దొరికారు.

రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెల్లలోని డివిజనల్ సబ్-ట్రెజరీ కార్యాలయంలో గురువారం ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేశారు. సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధను అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి నుంచి వీరు రూ.2.50 లక్షల లంచం డిమాండ్​ చేశారు. అందులో నుంచి గురువారం రూ.లక్ష తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Treasury Officers Bribe | జీతం డబ్బుల కోసం..

డివిజన్​ పరిధిలోని ఓ ఉద్యోగి గతంలో సస్పెండ్ అయ్యారు. అనంతరం తిరిగి విధుల్లో చేరి రిటైర్​ కూడా అయ్యారు. అయితే సస్పెన్షన్ కాలానికి చెందిన రూ.23,25,390 జీతం బిల్లులను, పదవీ విరమణానంతర పెన్షన్ సర్దుబాటు బకాయిలైన రూ.4,29,000ను ప్రాసెస్ చేసి, ఫార్వార్డ్ చేసినందుకు లంచం డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య తన వాటాగా రూ.50 వేలు తీసుకున్నాడు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి అనురాధ ఆదేశాల మేరకు ప్రైవేట్ వ్యక్తి వడ్డే జంగయ్య మరో రూ.50 వేలు తీసుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Hari Babu Murder | యూట్యూబర్​ వైష్ణవి హత్య కేసులో నిందితుడి దారుణ హత్య..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *