అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harvard Courses in Hyderabad | తెలంగాణను అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది.
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్’ కోర్సులు ఈ ఏడాది డిసెంబర్ నుంచే హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
TGEJAC CS Talks | TGEJAC – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలు వాయిదా
Harvard Courses in Hyderabad | ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్
తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎడ్యుకేషన్ హబ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
యూకే (UK) కి చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్స్, గ్లోబల్ వర్సిటీలు హైదరాబాద్‌కు తరలివస్తుండటంతో.. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీల దృష్టి తెలంగాణపై పడిందని వ్యాఖ్యానించారు.
Harvard Courses in Hyderabad | యువతకు అంతర్జాతీయ అవకాశాలు
హార్వర్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఎడ్యుకేషన్ సంస్థలు ఇక్కడ సేవలు అందించడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు, గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌లకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి రానుంది. ఈ విప్లవాత్మక నిర్ణయం తెలంగాణ రీసెర్చ్, బిజినెస్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ నైపుణ్యాభివృద్ధి రంగాలలో కొత్త శకానికి నాంది పలకనుంది.