22A Land Issues | 22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ

22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 22A Land Issues | 22ఏ జాబితాలోకి భూములు చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. తమ భూములను అమ్ముకోలేక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో సమస్యలను ఈ కమిటీ పరిష్కరించనుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలతో కమిటీ ఏర్పాటు ఏర్పాటు అయింది. కమిటీ ఛైర్మన్‌గా సీసీఎస్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, సభ్యులుగా లా సెక్రటరీ పాపిరెడ్డి, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవహరించనున్నారు.

22A Land Issues | తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములు, ప్రజల ఇళ్లు సైతం 22ఏలో చేరాయి. దీంతో వాటిని అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది. మరోవైపు ఇళ్లపై లోన్లు కూడా తీసుకోలేని పరిస్థితి. దీంతో అత్యవసరం అయిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Ponguleti Land Survey | రైతులకు ఆందోళన వద్దు.. అసైన్డ్ భూములను లాక్కోం: మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *