అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap Case | కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఎస్టీ బాలుర హాస్టల్ ఇన్ఛార్జీ వార్డెన్ (Hostel Warden), రికార్డు అసిస్టెంట్ బుక్య వలుసింహ ఏసీబీకి చిక్కాడు. రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పాల్వంచ హాస్టల్ వార్డెన్, రికార్డు అసిస్టెంట్ అయిన బుక్య వలుసింహ సత్యనారాయణ పురం హాస్టల్ ఇన్ఛార్జీ వార్డెన్‌గా కొనసాగుతున్నారు. హాస్టల్లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆగస్టులో 6 రోజులు విధులకు హాజరు కాలేదు. దానిని అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా, తద్వారా భవిష్యత్తులో ఆమె ఉద్యోగంలో ప్రతికూల పరిణామాలను నివారించడానికి, జీతం బిల్లుల తయారీలో ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు వార్డెన్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. బేరసారాల అనంతరం ఆ మొత్తాన్ని రూ.14 వేలకు తగ్గించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు నుంచి శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. వార్డెన్ వలుసింహాను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ACB Trap Case | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. రూ.500 లంచం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. బహుమతుల రూపంలో కూడా ఎలాంటి వస్తువులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Danam Nagender Disqualification | దానం నాగేందర్‌కు హైకోర్టులో బిగ్ షాక్.. అనర్హత వేటు వేస్తూ తీర్పు