అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghunandan Rao Danam Nagender | పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ సందర్భంగా దానం పొలిటికల్ హిస్టరీపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Raghunandan Rao Danam Nagender | ఘోర పరాజయం..
“గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి దానం నాగేందర్ ఫిరాయించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య” అంటూ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. అయితే దానం నాగేందర్‌కు ఉప ఎన్నికల సెంటిమెంట్ ఎప్పుడూ కలిసిరాలేదని,గతంలో కూడా’ ఉప ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం చవిచూశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఖైరతాబాద్‌కు రాబోయే ఉప ఎన్నికల్లో కూడా ఆయనకు ఓటమి తప్పదని, అక్కడ బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Raghunandan Rao Danam Nagender |అనర్హత వేటు ..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ ( Khairatabad )నుంచి గెలుపొందిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వేరే పార్టీ తరఫున లోక్‌సభ బరిలో నిలవడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని తేల్చిన తెలంగాణ హైకోర్టు.. సెప్టెంబర్ 18న ఆయనపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది.
ఇది కూడా చదవండి: Asian Games | ఆసియా క్రీడలు.. షూటింగ్లో భారత్‌కు రెండు రజతాలు