YSRCP Protest Vijayawada | వైసీపీ ధర్నా.. విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడలోని శాప్​ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: YSRCP Protest Vijayawada | విజయవాడ (Vijayawada)లో ఉద్రిక్తత ఓటు చేసుకుంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నాయకులు శాప్​ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు తరలిరావడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్​ చేస్తూ సోమవారం శాప్​ ఆఫీస్​ ఎదట ధర్నా చేపట్టారు. కాగా వైసీపీ నిరసనలకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్, పేర్ని నానికి నోటీసులు అందించారు. విజయవాడ వెళ్లే ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే తాడేపల్లి దగ్గర పోలీస్ పికెట్ పెట్టారు. శాప్ ఆఫీసుకు మూడు వైపులా భారీ బందోబస్తు ఉంచి ఎవరు రాకుండా చర్యలు చేపట్టారు.

YSRCP Protest Vijayawada | టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ

పోలీసులను తప్పించుకొని వైసీపీ నాయకులు శాప్​ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కడకు టీడీపీ నాయకులు సైతం తరలి వచ్చారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల కార్యకర్తలను అడ్డుకుని పోలీసులు చెదరగొట్టారు. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీ ఛార్జి చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అవకతవకలకు శాప్ ప్రధాన కారణమని వైసీపీ నాయకులు ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Tirumala Brahmotsavam | స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *