తెలంగాణRanjan Ratan Kumar | ఎస్సై టు డీసీపీ.. రంజన్​ రతన్​ కుమార్ ప్రస్థానం..

Ranjan Ratan Kumar | ఎస్సై టు డీసీపీ.. రంజన్​ రతన్​ కుమార్ ప్రస్థానం..

ఎస్సై స్థాయి నుంచి డీసీపీ వరకు ఎదిగిన ఎల్లారెడ్డి పట్టణవాసి జొన్నలగడ్డ రంజన్ రతన్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను బంధుమిత్రులు సన్మానించారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ranjan Ratan Kumar | సామాన్య కుటుంబంలో పుట్టి ఎస్సై స్థాయి నుంచి డీసీపీ వరకు ఎదిగిన ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణవాసి జొన్నలగడ్డ రంజన్ రతన్ కుమార్ పదవీవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఒక ప్రైవేట్​ ఫంక్షన్ హాల్‌లో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Ranjan Ratan Kumar | సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో..

ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్న రంజన్ రతన్ కుమార్ ఈ నెలాఖరుతో 37 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటారు. దీంతో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన బాల్య మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొని సన్మానించారు. అనంతరం డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టినా.. పోలీస్ ఉద్యోగం చేయాలనే గట్టి సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగానన్నారు.

తన 37 ఏళ్ల సర్వీసులో నిస్వార్ధంగా విధులు నిర్వహించానని.. తాను పుట్టిన ఎల్లారెడ్డి గడ్డ మీద పదవీ విరమణ సభ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులకు తన వంతుగా సహాయం చేశానని గుర్తు చేసుకున్నారు. దృఢ నిశ్చయంతో విధులు నిర్వహించానని, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో రొడ్డ ప్రభాకర్, సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు, డీసీపీ రంజన్ రతన్ కుమార్ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Disabled Welfare | దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉంది..: మంత్రి సీతక్క

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...