Ganesh Immersion | గణేష్ నిమజ్జనానికి కాకతీయ కాలువలోకి నీటి విడుదల

గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Ganesh Immersion | గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) నుంచి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు.

Ganesh Immersion | 1,000 క్యూసెక్కులు

కాకతీయ మెయిన్ కెనాల్‌లోకి, ఎల్‌ఎండీ ఎగువ భాగం వరకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. అధికారుల సూచనల మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు 1,000 క్యూసెక్కుల నీటిని కాకతీయ మెయిన్ కెనాల్‌లోకి విడుదల చేశారు. అనంతరం నీటి ప్రవాహాన్ని క్రమంగా పెంచుతూ సాయంత్రానికి 3,000 క్యూసెక్కులకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల సమయంలో అవసరమైన నీటి ప్రవాహం ఉండేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలు, నిర్వాహకులు అధికారుల సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Ganesh Mandaps | కామారెడ్డిలో అబ్బురపరుస్తున్న గణేష్ మండపాల సెట్టింగులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *