Stock Market Gains | లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 564 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ముడిచమురు ధరలు అదుపులో ఉండడంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. గ్లోబల్ మార్కెట్లలోని ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు సైతం లాభాలతో ట్రేడ్ అయ్యాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో ముగిశాయి.

Stock Market Gains | ఐటీ, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి..

స్మాల్‌క్యాప్ స్టాక్స్ మెరుగైన పనితీరును కనబరిచాయి. ఎఫఎంసీజీ, ఫార్మా, రియాల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభించగా.. ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అయితే రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత టెక్స్‌టైల్ స్టాక్స్ పడిపోయాయి.

Stock Market Gains | మిక్స్‌డ్ గా ప్రారంభమైనా..

దేశీయ మార్కెట్లు (Domestic markets) సోమవారం మిక్స్‌డ్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 252 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 333 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కోలుకుని 80 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 96 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 564 పాయింట్ల లాభంతో 74,858 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 23,414 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,213 కంపెనీలు లాభపడగా 2,243 స్టాక్స్ నష్టపోయాయి. 250 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 188 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 121 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 స్టాక్ లాభపడగా.. 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 4.11 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.42 శాతం, ఎటర్నల్ 2.59 శాతం, టైటాన్ 2.49 శాతం, ఐటీసీ 1.93 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎయిర్‌టెల్ 1.93 శాతం, పవర్‌గ్రిడ్ 1.15 శాతం, ఇన్ఫోసిస్ 0.97 శాతం, అదానీ పోర్ట్స్ 0.72 శాతం, టాటా స్టీల్ 0.62 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | లాభాల్లో ప్రధాన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *