అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mirabai Chanu | ఆసియా గేమ్స్ (Asian Games)లో భారత్ మరో సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 49 కేజీల ఫైనల్‌లో వెయిట్‌లిఫ్టింగ్ భారత స్టార్ ప్లేయర్ మీరాబాయి చాను చారిత్రాత్మక రజత పతకాన్ని గెలిచారు.
Mirabai Chanu | తొలి పతకం
మీరాబాయి చాను బుధవారం జరిగిన ఫైనల్‌లో తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయారు. ఈ పోటీలో మీరాబాయి మొత్తం 198 కిలోల బరువును ఎత్తారు. ‘స్నాచ్’ విభాగంలో 87 కేజీలు, ‘క్లీన్ అండ్ జర్క్’ విభాగంలో 111 కిలోలు ఎత్తి రజతం గెలుచుకున్నారు. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్ గమ్ 215 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని సాధించారు. కాగా బుధవారం భారత క్రీడాకారులు సత్తా చాటారు. షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పతకాలు, సాఫ్ట్ టెన్నిస్‌లో మరో బ్రాంజ్ గెలుచుకోగా.. తాజాగా మీరాబాయి సిల్వర్ మెడల్ సాధించారు. దీంతో భారత్ ఖాతాలో 11 పతకాలు చేరాయి.
ఇది కూడా చదవండి..: Soft Tennis India | సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు కాంస్య పతకం