Hyderabad SI Death | హైదరాబాద్​లో విషాదం.. బైక్​ ఢీకొని ఎస్సై మృతి

నిమజ్జన విధుల్లో ఉన్న ఎస్సై బైక్​ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్ వద్ద చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad SI Death | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. నిమజ్జన విధుల్లో ఉన్న ఎస్సైని ఓ బైక్​ ఢీకొనడంతో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ కె వెంకన్న (55) నిమజ్జన విధుల కోసం హైదరాబాద్​కు వచ్చారు. విధుల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్​ ఢీకొంది. అనంతరం ఆ బైక్​ నడుపుతున్న వ్యక్తి ఆపకుండా పరారు అయ్యాడు. కిందపడిపోయిన ఎస్సైని మిగతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతు వెంకన్న చనిపోయారు.

Hyderabad SI Death | నిందితుడి కోసం గాలింపు

కొత్తగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగినప్పుడు ఆయన ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన విధుల్లో ఉన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్​ అవుతోంది. సదరు వాహనదారుడు వేగంగా వచ్చి ఎస్సైని ఢీకొన్నట్లు అందులో ఉంది. అనంతరం ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు.

ఇది కూడా చదవండి..: The Paradise Movie | నానికి పోలీసుల షాక్​.. సినిమా చూసేందుకు అనుమతి నిరాకరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *