అక్షరటుడే, వెబ్‌డెస్క్: Danam Nagender | దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. దానం నాగేందర్ పిటిషన్ కొట్టివేసింది.
దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం, స్పీకర్ తీర్పును కొట్టివేసింది. దానంపై వేటు వేయడంతో పాటు ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొంది. ఈ తీర్పుపై దానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు షాక్ ఇచ్చింది. దానం నాగేందర్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Danam Nagender | ఎన్నికలకు వెళ్లండి
అనర్హత వేటు పడిందని, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.కాగా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారారు. అంతేగాకుండా కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాయి. అయితే పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అనర్హత వేయకుండా స్పీకర్ పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టిన ధర్మాసనం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. దీనిని సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదురైంది.
ఇది కూడా చదవండి..: Telangana Red Alert | వాయుగుండం ఎఫెక్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్