అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Asian Games Medals | ఆసియా గేమ్స్ (Asian Games)లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం ఉదయం మరో 3 పతకాలను సాధించారు. దీంతో భారత ఖాతాలో ఇప్పటి వరకు మొత్తం 26 పతకాలు చేరాయి.
పురుషుల మారథాన్ ఫైనల్లో సావన్ బర్వాల్ 2:11:37 సమయంతో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి, సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ఈ విభాగంలో భారత్ 44 ఏళ్ల తర్వాత పతకం సాధించడం గమనార్హం. షూటింగ్లో మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో తిలోత్తమ సేన్, విదర్శ వినోద్, ఆషి చౌక్సే రజతం గెలుచుకున్నారు. అంతేగాకుండా తిలోత్తమ, విదర్శ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరారు. జోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్‌ల జోడీ మిక్స్డ్ డబుల్స్ స్క్వాష్ ఈవెంట్ నుండి కాంస్య పతకంతో నిష్క్రమించింది. సెమీఫైనల్లో ఈ జోడీ, హాంకాంగ్‌కు చెందిన లీ కా యి, టాంగ్ మింగ్ హాంగ్ల చేతిలో ఓడిపోయింది.
India Asian Games Medals | పలువురి నిరాశ
పలు విభాగాల్లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. పురుషుల డెకాథ్లాన్ 100మీ హీట్ ఈవెంట్లో తేజస్విన్ శంకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానూ స్ప్రింట్ – పురుషుల కయాక్ సింగిల్ 500మీ సెమీఫైనల్లో హర్షవర్ధన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో యశస్విని ఓడిపోయింది.
ఇది కూడా చదవండి..: Asian Games | ఆసియా గేమ్స్.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం