Chakali Ailamma Jayanti | చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం : టీపీపీసీ చీఫ్​

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేమని టీపీపీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chakali Ailamma Jayanti | చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేమని టీపీపీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు. నగరంలోని వినాయక్​నగర్​లోని విగ్రహాల పార్క్​లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

Chakali Ailamma Jayanti | ఐలమ్మ ధైర్యసాహసాలు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ చిరస్థాయిగా నిలిచిన యోధురాలు అని పీసీసీ చీఫ్​ (PCC Chief) అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి ఎందరినో కదిలించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అణగారిన వర్గాలకు ఆమె శక్తిగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో వీరనారిగా నిలిచిన చాకలి ఐలమ్మ త్యాగానికి గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్​ 26న తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, రామ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Chakali Ailamma Jayanti | జెండా బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

Chakali Ilamma Jayanti

అనంతరం జెండా బాలాజీ ఆలయంలో పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, పుప్పాల రవి, పలువురు కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: VDCs Abolish Demand | వీడీసీలను రద్దు చేయాలి.. సీపీఐ డిమాండ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *