అక్షరటుడే, వెబ్‌డెస్క్: ED Office Protest | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈడీ అధికారులు రెండేళ్ల క్రితం పొంగులేటి నివాసాలపై దాడి చేశారు. రెండేళ్లు అవుతున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పొంగులేటి ఫ్లెక్సీతో నిరసన తెలిపారు.
ED Office Protest | అడ్డుకున్న పోలీసులు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినా ఎందుకు వివరాలు బయటపెట్టడం బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లకుండా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కేపీ వివేకానందలను, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఇది కూడా చదవండి..: Gamescraft Rummy Culture | గేమ్స్క్రాఫ్ట్, రమ్మీ కల్చర్‌కు ED భారీ షాక్.. రూ.442 కోట్ల ఆస్తుల జప్తు!