ఆంధ్రప్రదేశ్​Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రివర్గ సమావేశం ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉండనుంది.

గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో భారీ ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley)లో నిర్మించనున్న జంట గోపురాల ప్రాజెక్ట్ కీలకంగా నిలుస్తోంది. సుమారు రూ.1,208.41 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

Amaravati Development | అభివృద్ధిపై నిర్ణ‌యాలు..

ఇదే కాకుండా సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల గోపురాలకు సంబంధించిన ముఖభాగం, అద్దపు పనులకు రూ.2,540 కోట్ల ఖర్చు ప్రతిపాదన కూడా సమావేశంలో పరిశీలనకు రానుంది. అలాగే అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.798 కోట్ల వ్యయానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా కీలక చర్చ జరగనుంది. భూసమీకరణలో భాగంగా తమ భూములు ఇచ్చిన రైతులకు కౌలు పెంపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్ట భూమికి సంవత్సరానికి రూ.40,000, జరీబు భూమికి రూ.60,000 చొప్పున కౌలు పెంచే ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపవచ్చని తెలుస్తోంది.

అలాగే పలు విద్యా, ఆర్థిక సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అమరావతి అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.ఈ భేటిపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.

ఇది కూడా చదవండి..: TDP Working President | టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ ప్రమాణం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Trump Putin Talks | ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Putin Talks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shivadhar Reddy Farewell | తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి...

AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్​లో పదో...

 Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh | రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​...