అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Gambling Raid | నగరంలోని (Nizamabad) పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Nizamabad Gambling Raid | కోటగల్లీలో..
నగరంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోనెరెడ్డి కళ్యాణ మండపం వెనక భాగంలో కోటగల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.31వేల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ దాడిలో ఏఎస్సై రవీందర్, ఐడీ పార్టీ పోలీసులు రమేష్, సుభాష్, కానిస్టేబుల్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ములుగు గట్టమ్మ ఆలయానికి The Paradise టీమ్..