Moneyview IPO Listing | లాభాలపంట పండించిన ‘మనీవ్యూ’.. లిస్టింగ్‌లోనే 61.76 శాతం ప్రాఫిట్

డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మనీవ్యూ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి బలంగా అడుగుపెట్టింది. లిస్టింగ్ సమయంలోనే 61.76 శాతం లాభాలను అందించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneyview IPO Listing | భారతదేశంలోని ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) సంస్థలలో ఒకటైన మనీవ్యూను 2014లో స్థాపించారు. ఇది అన్ని రకాల ఆర్థిక మరియు రుణ సేవలను అందించే భారతదేశపు అగ్రశ్రేణి ఆల్ ఇన్ వన్ ఫైనాన్షియల్ యాప్. తన మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ ట్రాకింగ్ మరియు ఆర్థిక నిర్వహణ సేవలను అందిస్తోంది.ఈ కంపెనీ మార్కెట్‌నుంచి 1,091.68 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది.

Moneyview IPO Listing | ఐపీవోకు మంచి డిమాండ్..

మనీవ్యూ కంపెనీ ఐపీవో (IPO)కు ఇన్వెస్టర్లనుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు బిడ్లు ఆహ్వానించారు. మొత్తం కోటా 101.87 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 230.54 రెట్లు, ఎన్ ఐఐ కోటా 120.37 రెట్లు, రిటైల్ కోటా 20.41 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

Moneyview IPO Listing | జీఎంపీకి మించి లాభాలు..

మనీవ్యూ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపించింది. గురువారం ఉదయం 42 శాతం జీఎంపీ ఉంది. అయితే దీనికి మించిన ప్రీమియంతో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టడం గమనార్హం. కంపెనీ ఒక్కో షేరును రూ. 34కు విక్రయించగా.. 61.76 శాతం ప్రీమియంతో రూ. 55 వద్ద ఎన్ ఎస్ ఈలో లిస్టయ్యింది. ఆ తర్వాత రూ. 62 వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో 68.41 శాతం లాభంతో రూ. 57.26 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *