Hanumantha Rao Appointment | ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్‌ నియామకం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanumantha Rao Appointment | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, వి హనుమంత్​రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

వీహెచ్​ కాంగ్రెస్​లో సీనియర్ నాయకుడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు. ఇటీవల రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. అందులో ఒకదానిని వీహెచ్​ ఆశించారు. అయితే ఆయనను కాదని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సన్నిహితుడు వేం నరేందర్​రెడ్డికి పదవి అప్పగించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆయనను కేబినెట్​ హోదాతో బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఈ పదవితో ఆయన నెలకు రూ. లక్ష జీతం అందుకోనున్నారు. ఇతర అలవెన్స్​లు ఉంటాయి. బీసీ సంక్షేమ శాఖ నుంచి వీటిని చెల్లించనున్నారు.

Hanumantha Rao Appointment | భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి

డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy) నేడు పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు శివధర్​రెడ్డిని ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించింది. పోలీస్ వ్యవహారాలు, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ మరియు రహదారి భద్రతకు సంబంధించి సలహాలు అందించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ​​ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానంగా ఆయనకు ర్యాంక్​ కల్పించారు.

ఇది కూడా చదవండి..: Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *