Kamareddy RTO Inspections | ఆర్టీవో అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు

ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలని చెప్పే ఆర్టీవో అధికారులే నంబర్​ ప్లేట్​ లేని కారులో వెళ్లి వాహనాల తనిఖీలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy RTO Inspections | వాహనదారులు రూల్స్ పాటించేలా చేయడమే మా బాధ్యత.. మేము రూల్స్ పాటించాల్సిన అవసరం లేదన్నట్టుంది ఆర్టీవో అధికారుల తీరు. కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో అధికారుల తనిఖీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Kamareddy RTO Inspections | నంబర్​ ప్లేట్ లేని​ కారులో తిరుగుతూ..

రోడ్లపై నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఇతరత్రా ధృవపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ, అధికారులే నంబర్ ప్లేట్ లేని వాహనంలో వెళ్లి తనిఖీలు చేపడుతున్నారు. గురువారం తాడ్వాయి, భిక్కనూరు మండలాల పరిధిలో అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో నిబంధనలు పాటించని రెండు వాహనాలను పట్టుకుని సీజ్ చేసి వారికి జరిమానాలు విధించారు. అయితే రూల్స్ ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ నిబంధనలు చెప్పే అధికారులు మాత్రం నంబర్ ప్లేట్ లేని వాహనంలో వెళ్లి తనిఖీలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.

Kamareddy RTO Inspections | అధికారులే నిర్లక్ష్యం చేస్తే..

రవాణా శాఖలో పనిచేసే అధికారులే రూల్స్ పాటించకపోతే సామాన్యులు ఎలా పాటిస్తారని ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా రవాణాశాఖ అధికారి సంతోష్ ను వివరణ కోరగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు తమకు టార్గెట్స్ ఉన్నాయని, వాటి ప్రకారం తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. తాడ్వాయి మండలంలో నంబర్ ప్లేట్ లేని వాహనంలో అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: Kamareddy Theft Cases | కామారెడ్డిలో వరుస దోపిడీలు.. పోలీసులకు సవాల్​ విసురుతున్న దొంగలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *