Lovlina Borgohain | లవ్లీనా పసిడి పంచ్​.. బాక్సింగ్​లో ఘన విజయం

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్ ఫైనల్​లో ఘన విజయం సాధించి పసిడి పతకం గెలుచుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lovlina Borgohain | ఆసియా క్రీడల్లో భారత బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్ సంచలనం సృష్టించింది. ఫైనల్​లో ఘన విజయం సాధించి పసిడి పతకం గెలుచుకుంది.

జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) శుక్రవారం లవ్లీనా తన పంచులతో పసిడి గెలుచుకుంది. 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. చైనాకు చెందిన బావో జియిను ఓడించింది. దీంతో భారత పసిడి పతకాల సంఖ్య 12కు చేరింది. మహిళల డింగీ సెయిలింగ్ విభాగంలో భారత్‌కు చెందిన నేత్ర కుమనన్ కాంస్య పతకం గెలుచుకుంది. పతకాలు గెలిచిన క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు అభినందించారు. పతకాల పట్టికలో భారత్​ ఆరో స్థానానికి చేరింది.

ఇది కూడా చదవండి..: Archery Gold Medal | ఆర్చరీలో మరో బంగారు పతకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *