అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Gandhi Jayanti Nizamabad | మహనీయులు చూపిన బాటలో నడవాలని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం నగరం (Nizamabad)లోని గాంధీచౌక్‌లో మహాత్ముడి, లాల్‌బహదూర్ శాస్త్రి విగ్రహాలకు మేయర్‌తో పాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ నివాళులర్పించారు.
Gandhi Jayanti Nizamabad | వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి
వారు మాట్లాడుతూ.. జాతినేతలు దేశానికి చేసిన సేవలు అమోఘమన్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Farmers Power Protest | విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు