Gandhi Jayanti Banswada | గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే పోచారం

గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పోచారం అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Gandhi Jayanti Banswada | గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పోచారం (MLA Pocharam) అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.

Gandhi Jayanti Banswada | సత్యం.. అహింస.. శాంతి..

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సహనం వంటి విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మ గాంధీ అని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, ప్రజలను ఏకం చేసిన నాయకత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, సమానత్వం కలిగిన, సామాజిక న్యాయంతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆలోచనలు, ఆదర్శాలు నేటి సమాజానికే కాకుండా భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాసుల విజయ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gandhi Jayanti Nizamabad | మహనీయులు చూపిన బాటలో నడవాలి.. మేయర్​ ఉమారాణి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *