తెలంగాణKavitha TRS Party | కవిత టీఆర్​ఎస్​కు ఎన్నికల సంఘం ఆమోదం.. పార్టీ పేరులో చిన్న...

Kavitha TRS Party | కవిత టీఆర్​ఎస్​కు ఎన్నికల సంఘం ఆమోదం.. పార్టీ పేరులో చిన్న మార్పు

కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha TRS Party | కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఈ నెల 25 కొత్త పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. టీఆర్​ఎస్​ను కవితకు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Kavitha TRS Party | రక్షణ సేనగా..

కవిత గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలోని సంక్షిప్త రూపం టీఆర్​ఎస్​ (TRS) వచ్చేలా తన పార్టీ పేరు పెట్టారు. దీనిపై పలువురు బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం కవిత పార్టీకి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం ఇచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్​లోని కవిత నివాసంలో పార్టీకి అనుమతి ఇస్తూ అధికారులు లేఖ అందజేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత పేరు ప్రకటించగా.. ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించడం గమనార్హం. బీఆర్​ఎస్​ నాయకుల అభ్యంతరాలతో తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా.. తెలంగాణ రక్షణకు సేనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Kavitha TRS Party | మార్పు తెస్తారా..

కల్వకుంట్ల కవిత ఈనెల 25న మేడ్చల్​లోని అద్వయ కన్వెన్షన్​ హాల్​లో టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవడానికి, సామాజిక తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆమె ప్రకటించారు. మరి రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పార్టీ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో చూడాలి. తెలంగాణ (Telangana) ఇటీవల అనేక పార్టీలు పుట్టాయి. ప్రొఫెసర్​ కోదడరాం తెలంగాణ జన సమితి, ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలు ఉన్నాయి. అయితే అవి ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. మరోవైపు గత ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల వైఎస్​ఆర్​టీపీని ఏర్పాటు చేశారు. అనంతరం దానిని కాంగ్రెస్​లో విలీనం చేశారు.కవితకు రాజకీయ అనుభవం ఉండటం, తెలంగాణ జాగృతి నుంచి కార్యకర్తలు తోడు రావడంతో పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది. మరి రాష్ట్ర రాజకీయాల్లో కవిత మార్పు తెస్తారా లేదా చూడాలి.

ఇది కూడా చదవండి..: BJP President | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : బీజేపీ చీఫ్​

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Scientific Farming Methods | శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారానే లాభదాయకమైన దిగుబడులు

అక్షరటుడే, భీమ్​గల్ (ముచ్కూర్): Scientific Farming Methods | వ్యవసాయంలో శాస్త్రీయ...

Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Advisors | తెలంగాణ (Telangana)లో సలహాదారుల సంఖ్య...

Rajnath Singh Statement | భారత్ ఐటీ హబ్ అయితే.. పాక్ ఉగ్రవాదానికి హబ్ : రాజ్‌నాథ్ సింగ్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh Statement | భారత సాయుధ దళాల...

Mupkal Bus Stand | బస్​ షెల్టర్​ సొంతంగా నిర్మించిన గ్రామస్తులు.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

అక్షరటుడే, భీమ్​గల్: Mupkal Bus Stand | బాల్కొండ నియోజకవర్గం (Balkonda...