India Pakistan Final | పాక్​తో ఫైనల్​ పోరు.. భారత్ భారీ స్కోరు

ఆసియా క్రీడల్లో పసిడి కోసం పాక్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో భారత్ 211 పరుగులు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Pakistan Final | ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా పసిడి పతకం కోసం భారత క్రికెట్​ జట్టు​ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో ఫైనల్​లో తలపడుతోంది. కరోగి స్పోర్ట్స్​ పార్కులో జరిగిన మ్యాచ్​లో భారత్​ 211 పరుగులు చేసింది.

సెమీస్​లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్​ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఫైనల్​లో భారత్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. భారత చిచ్చర పిడుగు వైభవ్​ సూర్యవంశీ రెండు సిక్కులతో ఊపు మీద కనిపించాడు. అయితే 15 పరుగులకే అతడు ఔట్​ అయ్యాడు. అనంతరం అభిషేక్​ శర్మ చెలరేగాడు. పాక్​ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి.

India Pakistan Final | తిలక్​ వర్మ హాఫ్​ సెంచరీ

ఫస్ట్​ డౌన్​లో వచ్చిన సంజు శాంసన్​ 2 పరుగులకే ఔట్​ అయ్యాడు. 93 పరుగుల వద్ద అభిషేక్​ శర్మ పెవిలియన్​ బాట పట్టాడు. అనంతరం భారత స్కోర్​ వేగం నెమ్మదించింది. కెప్టెన్​ శ్రేయాస్​ అయ్యర్​ (21), ఇషాన్ కిషన్​ 20 నిలకడగా ఆడారు. అయితే వెంటవెంటనే వారు ఇద్దరు ఔట్​ అయ్యారు. 14.1 ఓవర్లకు భారత్​ 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అనంతరం శివమ్​ దూబే (27), తిలక్​ వర్మ (51) ఇన్నింగ్స్​ను చక్కదిద్దారు. చివర్లో ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తిలక్​ వర్మ 20 బంతుల్లో హఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్​ 211 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​లో గెలిస్తే ఆసియా క్రీడల్లో భారత్​ గోల్డ్​ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే భారత మహిళల జట్టు పసిడి సాధించింది.

ఇది కూడా చదవండి..: Pranavi Urs Gold Medal | గోల్ఫ్​లో పసిడి సాధించిన ప్రణవి.. ఆర్చరీలో మరో బంగారు పతకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *