Vikarabad Bus Accident | లోయలో పడిన బస్సు.. ముగ్గురి మృతి

వికారాబాద్​ జిల్లా అనంతగిరి వద్ద ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vikarabad Bus Accident | వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి దగ్గర ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Vikarabad Bus Accident | 20 మందికి గాయాలు

కేసరం నుంచి చింతకుంట వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అనంతగిరిలోని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లగానే, స్థానికులు సహాయం చేయడానికి పరుగెత్తుకొచ్చారు. సహాయక బృందాలు వచ్చేలోపే వారు బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి..: Vikarabad Mother Suicide | ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *