అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Leopard Sighting | మోపాల్ మండల శివారులో చిరుత సంచారం కలకలం రేపింది.. దీంతో రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Leopard Sighting | మోతీరాం నాయక్ తండాలో..
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం (Mopal Mandal) మోతీరాం నాయక్ తండా నుంచి కాల్పోల్ వెళ్లే దారిలో శుక్రవారం కొందరికి చిరుత కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన వారు వెంటనే సమీప గ్రామాల ప్రజలకు అలర్ట్ చేశారు. శనివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు చిరుత ఆనవాళ్లు తెలుసుకునేందుకు మోపాల్ గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఒంటరిగా రాత్రివేళల్లో బయటకు రావొద్దని.. అత్యవసరమైతే తప్ప అటవీప్రాంతం వైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..: DCM Truck Accident | లారీని ఢీకొట్టిన డీసీఎం: డ్రైవర్ దుర్మరణం, క్లీనర్‌కు తీవ్ర గాయాలు