అక్షరటుడే, కామారెడ్డి: Fake Death Certificate | కామారెడ్డిలో(Kamareddy) నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బతికున్న మహిళ చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రం సృష్టించి ఇంటి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు.
Fake Death Certificate | సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వాదం..
కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ వివాదం చోటుచేసుకుంది. హసీనా బేగం పేరుపై ఉన్న 100 గజాల ఇంటిని సయ్యద్ అలీ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. బతికున్న హసీనా బేగం చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని వారు తెలిపారు. అంజలి డాక్యుమెంటేషన్‌కు చెందిన స్వామి వద్ద ఈ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించారని బాధితులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్‌పై (Sub Registrar) కూడా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించారని ఆరోపిస్తూ కార్యాలయంలోనే అధికారులను నిలదీశారు. తమకు న్యాయం చేయాలని, నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఐక్యరాజ్యసమితి వేదికపై.. మార్మోగిన తెలుగు స్వరం!