Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష

భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Wife Suicide Case | భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad Sessions Court)సెషన్స్ జడ్జి జీవిఎన్ భరతలక్ష్మీ మంగళవారం తీర్పు వెలువరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

Wife Suicide Case | చంద్రాయన్​ పల్లికి చెందిన..

పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన వేముల సాయిలుకు డిచ్​పల్లికి చెందిన మనోజతో 2016లో వివాహం జరిగింది. పెళ్లిలో ఎలాంటి వరకట్నం తీసుకోనప్పటికీ కొన్నాళ్లకు వరకట్నం కోసం సాయిలు వేధిస్తూ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. భార్యను ఉద్దేశించి నువ్వు చనిపోతే నేను మరొక పెళ్లి చేసుకుంటే నగదు కట్నం డబ్బులు వస్తాయని పదేపదే అనేవాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని ఆమె చంద్రాయన్ పల్లి గ్రామ శివారులోని పెద్ద పోషవ్వ గుడి దగ్గర వేపచెట్టుకు 2024 అక్టోబర్ 13న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డిచ్​పల్లి సర్కిల్ పోలీస్ ఇన్​స్పెక్టర్​ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్​ ఆధారంగా సెషన్స్ జడ్జి భరత లక్ష్మీ సాక్ష్యాలను పరిశీలించి సాయిలుపై నేరం నిరూపితమైనట్లు ధృవీకరించారు. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.వేయి జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడడంలో ప్రముఖ పాత్ర పోషించిన బ్రీఫింగ్​ ఆఫీసర్ ఎస్సై బి.సుమలత, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై బి.మనోజ్, పీపీ రాజేశ్వర్ రెడ్డి, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్సై గోవింద్, సీఎంఎస్​ కోర్టు సీడీవోలను సీపీ సాయిచైతన్య అభినందించారు.

ఇది కూడా చదవండి: సోషల్ మీడియా ఫేమ్ ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్‌కు తీవ్ర అస్వస్థత.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *